రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రేవ్ పార్టీ బాగోతం బయపడింది.
మొయినాబాద్: రేవ్ పార్టీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. విలాసాలకు అలవాటుపడిన యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మత్తులో జోగుతూ అనైతిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రేవ్ పార్టీ బాగోతం బయపడింది. ఓ ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై సోమవారం రాత్రి సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.అర్థనగ్నంగా డాన్సులు చేస్తున్న 8 మంది ముంబై మోడల్స్, 22 మంది యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో సుల్తాన్ బజార్ వ్యాపారులున్నట్టు తెలుస్తోంది.