అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మోయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అమడాపురం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమడాపురం గ్రామానికి చెందిన గణేష్ రెడ్డి(48) కుటుంబ అవసరాల కోసం రూ. 2లక్షలు అప్పుచేశాడు.
కాగా తన రెండు ఎకరాల పొలంలో సాగు చేసిన పంట ఎండిపోవడంతో అప్పు తీర్చే మార్గం కనపడక మనస్తాపం చెందిన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నట్లు సమాచారం.