సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి.
రామచంద్రభారతి తన ఫోన్‌లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది.
చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
Comments
Please login to add a commentAdd a comment