
అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకుంటున్న గుజరాత్ బృందం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం గ్రామాన్ని గుజరాత్‌కు చెందిన సర్పంచ్‌లు, అధికారులు, మహిళ సంఘాల అధ్యక్షులతో కూడిన 20 మంది సభ్యుల బృందం ఎన్‌ఐఆర్డీ అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. బాకారం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి గురించి సాక్షర భారత్ జాతీయ అవార్డు పొందిన గ్రామ సర్పంచ్ బద్దుల సుధాకర్ యాదవ్ వివరించారు. ముందుగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామంలో కొనసాగుతున్న టిష్యూ పేపర్ తయారీ, అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సకాలంలో ఇంటి పన్ను, నల్లా బిల్లు ప్రజలు చెల్లిస్తున్నారని తెలుసుకుని గుజరాత్ బృందం అభినందించింది. గ్రామంలో మురుగు కాలువలు, రోడ్లు, వీధిదీపాలు, పాఠశాల అభివృద్ధి, లైబ్రరీ ఏర్పాటు చేయడం చూసి.. గ్రామాభివృద్ధిలో బాకారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కితాబిచ్చారు. వారి వెంట ఎన్‌ఐఆర్డీ అధికారులు డాక్టర్ జీవీ క్రిష్ణ, లోహిదాస్, డాక్టర్ హేమంత్ కుమార్, బాకారం గ్రామ వార్డు సభ్యులు కొత్తపల్లి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment