
జానకిరామ్ అంత్యక్రియలు పూర్తి
మొయినాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్ లోని సొంత ఫాంహౌస్ లో ఆదివారం మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు జరిగాయి. జానకిరామ్ తనయుడు తారక రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. రాజకీయ, సినీ ప్రముఖులు జానకిరామ్ పార్థీవదేహం వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జానకిరామ్ తండ్రి హరికృష్ణను పరామర్శించారు. జానకిరామ్ భార్య, పిల్లలను ఓదార్చారు.