మొయినాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్ రెవెన్యూ పరిధిలో భూమి కొనుగోలు కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి పదిగంటల సమయంలో ఆయన రహస్యంగా ఇక్కడికి వచ్చారు. ఓ ఫాంహౌస్‌లో విందుకు వచ్చారని చెబుతున్నా.. భూమి కొనుగోలు విషయం మాట్లాడేందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సురంగల్ రెవెన్యూ పరిధిలోని ఓ సినీ దర్శకుడి ఫాంహౌస్ పక్కనే 40ఎకరాల భూమిని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనుగోలు చేస్తున్నారని, ఆ భూమిని చూసేందుకే ఆయన వచ్చి ఉంటారని చెబుతున్నారు. ఆయన ఒక్కరే రహస్యంగా రావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.