సాక్షి, నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిపై జరుగుతున్న విచారణ ఫోక్సో స్పెషల్ కోర్టులో గురువారం ముగిసింది. తదుపరి విచారణను జనవరి 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను జడ్జి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. కానీ జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు అతని నుంచి ఎక్కువగా కాదు, లేదు, తెలియదు అనే సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ప్రశ్నలను అడిగే సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు.
ఫోర్న్ వీడియోలు చూస్తావా అని జడ్జి ప్రశ్నించగా.. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదని సమాధానమిచ్చాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు పేర్కొనడం జరిగింది. కాగా బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు ఫోరెన్సిక్ రిపోర్టులో నీదే అని తేలింది.. దీనిపై నువ్వేమంటావు అని జడ్జి ప్రశ్నించగా.. ఎస్‌ఓటీ పోలీసులే వాటిని దుస్తులపై సిరంజిలతో చల్లారని నిందితుడు చెప్పినట్టు సమాచారం.
హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపిందని నిందితుడు వెల్లడించాడు. అయితే ఈ కేసులో సాక్ష్యాలుగా తన అమ్మ, నాన్న, అన్నని తీసుకురావాలని నిందితుడు జడ్జిని కోరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment