సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిక
పోచారం కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా..
రైతు సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని పోతామన్న ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌లో పుట్టి చివరకు అదే పార్టీలోకి వచ్చానన్న బాన్సువాడ ఎమ్మెల్యే
రేవంత్‌కు 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య
నలుగురు తప్ప బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరన్న దానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు.
అండగా నిలవాలని కోరా
తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి: పోచారం
సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్‌లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
త్వరలో మరిన్ని చేరికలు?
పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం.
పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.
ఈ క్రమంలో బాల్క సుమన్‌ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment