Ex speaker
-
కాంగ్రెస్‌లోకి మాజీ స్పీకర్ పోచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పోచా రం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు.. చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహా్వనించారు. పోచారంతో పా టు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడే సీఎం మీడియాతో మాట్లాడారు. అండగా నిలవాలని కోరా తెలంగాణ పునరి్నర్మాణంలో భాగంగా పోచారంను కలిశామని, పెద్ద నాయకుడిగా తమకు అండగా నిలబడాలని కోరామని రేవంత్ చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. రైతుల విషయంలో పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. తమది రైతు రాజ్యమని, రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి: పోచారం సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని పోచారం చెప్పారు. రైతు సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యమైనవని పేర్కొన్నారు. తాను స్వయంగా రైతునని, రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలని కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లలో పనిచేసినా చివరకు కాంగ్రెస్ పార్టీలోకే వచ్చానని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాలని, ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో మరిన్ని చేరికలు?పోచారం చేరిక నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వచ్చారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. దానం నాగేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలంటూ ఏకంగా ఓ జాబితానే ప్రకటించారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని ఆయన చెప్పడం గమనార్హం. కాగా దానం, తాజాగా పోచారంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పారీ్టలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సీపీఐతో కలిసి 70కి చే రడం గమనార్హం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్ యత్నంబంజారాహిల్స్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసం నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు అక్కడకు వచ్చారు. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడి నినాదాలు చేస్తూ బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వావాదం, తోపులాట జరిగింది.ఈ క్రమంలో బాల్క సుమన్‌ను బలవంతంగా బయటకు తీసుకువచి్చన పోలీసులు జీపులో కూర్చోబెట్టి తరలించేందుకు ప్రయత్నించారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి అందరినీ చెల్లాచెదురు చేసి. బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. సీఎంఉ ండగానే పోచారం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, అందరికీ బెయిల్ మంజూరైంది. -
టీఆర్ఎస్లోకి సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఈనెల 12న టీఆర్ఎస్లో చేరనున్నారు. మంత్రి కె.తారక రామారావు శుక్రవారంæ ఉదయం సురేశ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లోకి రావాల్సిందిగా సురేశ్‌రెడ్డిని ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన.. తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని వెల్లడించారు. 12న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సముచిత స్థానం కల్పిస్తాం: కేటీఆర్ సమైక్య రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా అందరి మన్ననలు పొందిన సురేశ్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు. సురేశ్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ సమయంలో సురేశ్‌రెడ్డితో భావసారూప్యత ఉండేదని చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ ఆహ్వానాన్ని అంగీకరించి పార్టీలోకి వస్తున్న సురేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవం: సురేశ్‌రెడ్డి రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల నుంచి నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నానని సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే టీఆర్ఎస్ ఆ హ్వానాన్ని అంగీకరించినట్లు చెప్పారు. వ్యవసాయం, సాగునీ టి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని, రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. టీఆర్ఎస్లోకి రావడంలో రాజకీయ లబ్ధి చూసుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు. మండలి చైర్మన్‌గా సురేశ్‌రెడ్డి? ఎన్నికలైన తర్వాత శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇవ్వడంతోపాటు చైర్మన్‌గా ఎన్నుకుంటామని సురేశ్‌రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే శాసనమండలికి పలువురు రిటైర్ అవుతున్నారు. ఆ జాబితాలో శాసన మండలి ప్రస్తుత చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఉన్నారు. స్వామిగౌడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత సురేశ్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. 1984లో మండల స్థాయి లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2004–09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్‌గా పనిచేశారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
రెండేళ్లలో రూ.80 వేల కోట్ల అప్పులా?
తెనాలి: అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీ కాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్‌షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశర«థరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయండి పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ -
రెండేళ్లలో రూ.80 వేల కోట్ల అప్పులా?
శ్వేతపత్రం విడుదల చేయండి పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి: అప్పులు చేసి పప్పుబెల్లాలు తింటున్న చందంగా ప్రభుత్వం అనవసర కార్యక్రమాలకు విచ్చలవిడి వ్యయం చేస్తూ వేలాది కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల పదవీ కాలంలో మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, అందులోని మొత్తాన్ని ఖర్చుపెట్టామని చెబుతూనే రూ.80 వేల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చినట్టు అమిత్‌షా ప్రకటించిన రూ.1.40 లక్షల కోట్ల డబ్బు ఏమైందనే ప్రశ్నలను తేటతెల్లం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం చేసిన ఆదాయ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలిలోని స్వగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.1.78 లక్షల కోట్లు కాగా, విభజన సమయంలో మన వాటా రూ.1,04,189 కోట్లుగా తేల్చినట్టు గుర్తుచేశారు. రెండేళ్లలో ఆ అప్పులు రూ.1,90,513 కోట్లకు పెరిగాయంటే రూ.80 వేల కోట్ల అప్పులు చేసినట్టు స్పష్టమవుతోందన్నారు. వడ్డీ కిందనే రూ.11 వేల కోట్లను వెచ్చించాల్సి ఉందన్నారు. రుణమాఫీ అన్నారు...రైతులకు అన్యాయం చేశారంటూ, మాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను వంచించారని, కొత్తగా అర్జీలు పెట్టుకున్న ఏ ఒక్క పేదవాడి కోసం ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. భాగస్వామ్య ఒప్పంద సదస్సు, ఎంఓయూలతో వేలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ఆర్భాటాల్లోనూ పస లేదని వెల్లడైందన్నారు. అప్పులు తెచ్చిన అనవసర కార్యక్రమాలకు వెచ్చిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం ప్రత్యేకహోదా కోసం ప్రయత్నం చేయటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, ఎం.దశర«థరామిరెడ్డి, షేక్ రహిమాన్, దొడ్డక ఆదినారాయణ, నల్లగొర్ల నాగేశ్వరరావు. పిల్లి సుధాకర్ పాల్గొన్నారు. -
రేవంత్ విషయంపై చంద్రబాబు నోరువిప్పాలి