
యునెస్కో ప్రతినిధికి జ్ఞాపిక అందజేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అన్ని అర్హతలున్నందున రామప్ప దేవాలయాన్ని ఆ జాబితాలోకి చేర్చేలా చొరవ చూపాలని యునెస్కో ప్రతినిధి వాసు పొష్యానందనను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆ జాబితాలో చేర్చేందుకు రామప్ప దేవాలయానికి ఏమేర అర్హతలున్నాయో పరిశీలించేందుకు వచ్చిన ఆయనను శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టతను, చరిత్రను, శిల్ప కళా వైభవాన్ని తెలియచేసే ఆలయ దృశ్యమాలికను ఆయనకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment