సాక్షి, హైదరాబాద్: ముత్యం రెడ్డి 30 ఏళ్లు ప్రజల కోసం బతికితే.. టీఆర్‌ఎస్ పార్టీ ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా అవమానాన్ని ఇచ్చింది అంటూ ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారు. జనాలు పల్లెలు నుంచి పట్నాలకు వెళ్లకుండా.. పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి. ఐదు మార్కెట్ యార్డ్‌లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం)
నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే.. ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థినే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment