Mugguru Monagallu Trailer: వెరైటీ కామెడీ.. అలా దర్శనమిచ్చిన టీఎన్‌ఆర్‌ - Sakshi
Sakshi News home page

Mugguru Monagallu: వెరైటీ కామెడీ.. అలా దర్శనమిచ్చిన టీఎన్‌ఆర్‌

Published Tue, May 25 2021 3:26 PM | Last Updated on Tue, May 25 2021 3:49 PM

Mugguru Monagallu Trailer Out - Sakshi

Mugguru Monagallu: టాలీవుడ్‌ స్టార్‌ కెమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా,  దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గ‌రు మొన‌గాళ్లు’. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త‌ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.

 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. స‌ర‌దాగా సాగుతూనే ఓ మిస్ట‌రీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైల‌ర్‌. మ‌రి ఆ హ‌త్య కేసు ఏంటి? వీళ్ల‌కి దానికి సంబంధం ఏంటి?  పోలీసులు ఈ అమ‌యాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? త‌దిత‌ర ఆస‌క్తికర విష‌యాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివంగ‌త న‌టుడు, జర్నలిస్టు టీఎన్ఆర్  కీల‌క పాత్రలు పోషించారు. రిత్విష్‌ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్‌గా నటించారు. చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement