trailer lounch
-
Vishwak Sen: అఘోరా అనుకొని ధర్మం చేశారు!
‘‘గామి’ సినిమా షూటింగ్‌ని వారణాసిలోని కుంభమేళాలో జరిపినప్పుడు నేను నిజమైన అఘోరా అనుకొని కొందరు ధర్మం చేశారు. అక్కడ చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ వృద్ధురాలు భోజనం పెట్టి, టీ ఇచ్చింది. ‘గామి’ ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మునుపెన్నడూ కలిగించని సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గామి’. చాందినీ చౌదరి కథానాయిక. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘గామి’ కోసం దాదాపు నాలుగున్నరేళ్లు పని చేశాం. ఇంత సమయం పట్టింది కాబట్టే మంచి గ్రాఫిక్స్‌ని రాబట్టుకున్నాం’’ అన్నారు. ‘‘మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం. ఈ సినిమా కోసం వారణాసిలో కుంభమేళా షూటింగ్ చేశాం. మైనస్ 40 డిగ్రీల్లో కూడా గ్లౌజులు లేకుండా నటించాడు విశ్వక్’’ అన్నారు విద్యాధర్ కాగిత. ‘‘2018లో ‘గామి’ మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ మోడల్లో చేశాం’’ అన్నారు కార్తీక్ శబరీష్. ∙విశ్వక్ సేన్, చాందినీ చౌదరి -
బింబిసార.. అందమైన చందమామ కథ
‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం.. చదివాం.. వెండితెరపై చూశాం. తాతగారు (దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్) చేసిన ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, బాబాయ్ (బాలకృష్ణ) చేసిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’.., చిరంజీవిగారు చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, మా జనరేషన్లో తమ్ముడు (ఎన్టీఆర్) చేసిన ‘యమదొంగ’, రామ్‌చరణ్ చేసిన ‘మగదీర’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలు గమనిస్తే.. అందమైన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అర్థమవుతుంది. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అదే మా ‘బింబిసార’. ఈ ఏడాది మా తాతగారు ఎన్టీఆర్ నూరవ జయంతి సంవత్సరం కాబట్టి ఆయనకు మా ‘బింబిసార’ను అంకితం ఇస్తున్నాను’’ అని నటుడు–నిర్మాత కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. జూలై 5న కల్యాణ్‌రామ్ బర్త్ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి, సపోర్ట్ చేసిన నిర్మాత హరికి, ప్రోత్సహించిన నా బింబిసారుడు కల్యాణ్‌రామ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు వశిష్ఠ్. -
నవ్వులు పూయిస్తున్న ‘ముగ్గురు మొనగాళ్లు’
Mugguru Monagallu: టాలీవుడ్ స్టార్ కెమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గరు మొనగాళ్లు’. ఈ సినిమాతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల కథ ఇది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్లో శ్రీనివాస్ రెడ్డి చెవిటి వాడిగా, దీక్షిత్ శెట్టి మూగ వాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. సరదాగా సాగుతూనే ఓ మిస్టరీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైలర్. మరి ఆ హత్య కేసు ఏంటి? వీళ్లకి దానికి సంబంధం ఏంటి? పోలీసులు ఈ అమయాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తదితర ఆసక్తికర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దివంగత నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కీలక పాత్రలు పోషించారు. రిత్విష్ శర్మ, శ్వేతా వర్మ హీరోయిన్స్‌గా నటించారు. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
బాగా నవ్వాలి – అల్లరి నరేష్
గోవింద్ రాజ్, సంతోష్, సీహెచ్ సిద్ధేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సర్వం సిద్ధం’. (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్ విడుదల చేసి, ఈ సినిమా ట్యాగ్ లైన్ సినిమాలో ఉండబోయే కామెడీని సూచిస్తోందని, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలని అన్నారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. -
నవ్వులు గ్యారంటీ!
ఆ కుర్రాడు మాయ చేయడంలో దిట్ట. ఇలాంటోడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వినోదం 100%’. విజయ్ భరత్, అశ్విని, కాంచన నాయకానాయికలుగా జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతీ మాట్లాడుతూ- ‘‘ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. క్రిస్మస్కు ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. సంపూర్ణేష్‌బాబు, పృథ్వీల పాత్రలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు.