నవ్వులు గ్యారంటీ!
ఆ కుర్రాడు మాయ చేయడంలో దిట్ట. ఇలాంటోడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వినోదం 100%’. విజయ్ భరత్, అశ్విని, కాంచన నాయకానాయికలుగా జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతీ మాట్లాడుతూ- ‘‘ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. క్రిస్మస్‌కు ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. సంపూర్ణేష్‌బాబు, పృథ్వీల పాత్రలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు.