‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం.. చదివాం.. వెండితెరపై చూశాం. తాతగారు (దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్) చేసిన ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, బాబాయ్ (బాలకృష్ణ) చేసిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’.., చిరంజీవిగారు చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, మా జనరేషన్‌లో తమ్ముడు (ఎన్టీఆర్) చేసిన ‘యమదొంగ’, రామ్‌చరణ్ చేసిన ‘మగదీర’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలు గమనిస్తే.. అందమైన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అర్థమవుతుంది. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అదే మా ‘బింబిసార’. ఈ ఏడాది మా తాతగారు ఎన్టీఆర్ నూరవ జయంతి సంవత్సరం కాబట్టి ఆయనకు మా ‘బింబిసార’ను అంకితం ఇస్తున్నాను’’ అని నటుడు–నిర్మాత కల్యాణ్ రామ్ అన్నారు.
కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. జూలై 5న కల్యాణ్‌రామ్ బర్త్ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి, సపోర్ట్ చేసిన నిర్మాత హరికి, ప్రోత్సహించిన నా బింబిసారుడు కల్యాణ్‌రామ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు వశిష్ఠ్.
Comments
Please login to add a commentAdd a comment