హాజీపూర్ ఘటనలో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు శనివారం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పినట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వెతకగా కల్పన, మనీషాలకు సంబంధించిన ఆధార్, స్కూల్ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తుంగని కల్పన హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహాన్ని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు.