
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నిలిచారు. గోల్డ్‌ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉందని, అందుకు సాక్షికి కృత జ్ఞతలు తెలియచేశారు. ఇటీవలె తనకు ఆడపిల్ల పుట్టిందని ఈ బంగారాన్ని ఆమెతోపాటు ,తన భార్యకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాక్షి ఇచ్చే కథనాలంటే తనకు బాగా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షి డైరెక్టర్లు, సీఈవో చేతుల మీదుగా అరకిలో బంగారాన్ని అందుకున్నారు. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సాక్షి యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. చదవండి.. గెలవండి అనే నినాదంతో సాక్షి నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్‌కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment