
సాక్షి, హైదరాబాద్ : సాక్షి సెలబ్రేషన్స్ ఆఫర్ అరకిలో బంగారం విజేతగా కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ప్రకాశం జిల్లా) నిలిచారు. సాక్షి పాఠకులను ప్రోత్సహించే క్రమంలో యాజమాన్యం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ‘చదవండి.. గెలవండి’ అనే నినాదంతో ‘సాక్షి’ నిర్వహించిన ఈ సెలబ్రేషన్ ఆఫర్‌కు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాక్షి పాఠకులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. వారిలో 20,083 మంది విజేతలుగా నిలిచారు. వారందరికి బహుమతులను అందజేసేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేపట్టింది. విజేతల పేరులను https:// www. sakshi. com/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విజేతలుగా నిలిచిన పాఠకులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తారు. మంగళవారం సాక్షి ప్రధాన కార్యాలయంలో ఈ ఆఫర్ లక్కీడీప్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతి«థిగా విచ్చేసిన విశ్రాంత న్యాయమూర్తి కె.రవీందరెడ్డి విజేతలను ప్రకటించారు. గోల్డ్ విన్నర్ శ్రీనివాస్‌రెడ్డికి ఆయన ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు సాక్షి దినపత్రిక ఏజెంట్లు వినోద్ (సరూర్‌నగర్), సురేష్ (రామంతాపూర్), నాగిరెడ్డి (ఈసీఐఎల్), శ్రీనివాసరెడ్డి (నేరేడ్‌మెంట్), కిషోర్‌కుమార్ (అబిడ్స్), రషీద్ (తార్నాక) కూడా వివిధ కేటగిరీల్లోని విజేతలను ప్రకటించారు. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
తొలి 3 కేటగిరీల్లో విజేతలు వీరే..
- మొదటి కేటగిరి : అర కిలో బంగారాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన కాశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న ఈయన.. ‘నాకు గోల్డ్‌ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. దీనిని నేను ఊహించలేదు. కారు వస్తే బాగుంటుందని ఆశించా. ఏకంగా అర కిలో బంగారం దక్కింది’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
- రెండవ కేటగిరి : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోటి వరప్రసాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన కె.రాజేందర్ మారుతి స్విఫ్ట్ కార్లను సొంతం చేసుకున్నారు.
- మూడవ కేటగిరి : ఎస్.రవీంద్రనాథ్ (కొవ్వూరు), మహమ్మద్ పాషా (హైదరాబాద్), పి.జాకరయ్య (కడప), స్వర్ణలత (గన్నవరం), ఎస్.ఎ. రహమాన్ (గుంతకల్), ఎం.అంకిత, ఎం.జగన్నాథన్ (కర్నూలు), ఆర్.సంయుక్త (హైదరాబాద్), ఉద్దారగుడి చిరంజీవి), కుప్పలి శశిభూషణరావు (పార్వతిపురం).. యాక్టివా స్కూటర్లను గెలుచుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సాక్షి కృషి
విభిన్న కోణాల్లో ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ వాటి పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేయడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామాలకు సైతం ‘సాక్షి’ చేరుకోవడం స్ఫూర్తిదాయకం. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకర్లను అభినందించాలి. అక్కడి సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్దఎత్తున పాఠకుల ఆదరణను సంపాదించుకున్న ‘సాక్షి’ యాజమాన్యం అభినందనీయులు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి. పాఠకులను ప్రోత్సహించే క్రమంలో సెలబ్రేషన్ ఆఫర్‌ను ‘సాక్షి’ పారదర్శకంగా నిర్వహించినందుకు కృతజ్ఙతలు. విజేతలకు అభినందనలు. – కె.రవీందర్‌రెడ్డి, విశ్రాంతి న్యాయమూర్తి