![Custom Milled Rice Storage Problem In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/10/SRINIVAS-REDDY.jpg.webp?itok=wtoGXSw6)
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment