Custom milling of rice
-
మిల్లులపై కొరడా! సీఎంఆర్ అక్రమాలపై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. భారీగా బియ్యం పెండింగ్.. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ అంటారు. మిల్లింగ్ చేసి ఇచి్చనందుకు రైస్‌మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్‌కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్‌సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్.. కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్‌లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే అవకాశముంది. నాణ్యమైనది అమ్ముకుని..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఆగ్రహించి సీఎంఆర్ ఆపినా.. మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్‌పూల్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్‌కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేలురకం అమ్మేసుకోవడంతోనే! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. నాలుగు సార్లు గడువు పెంచినా.. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్ వరకు, మళ్లీ సెపె్టంబర్ వరకు, చివరికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం! -
బియ్యం ఎక్కడ నిల్వ చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
‘సీఎంఆర్’ ఎగవేతదారులపై పీడీ కేసులు
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు చెల్లించని మిల్లర్లపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. 2015–16కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇప్పటికీ వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 21 మంది మిల్లర్ల నుంచి రూ.17 కోట్ల విలువైన 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ల (డీఎం)తో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. 2015–16 సీఎంఆర్ బకాయిల చెల్లింపు గడువు గతేడాది అక్టోబరు 31వ తేదీతో ముగిసిందని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిందని, ఆ గడువు కూడా డిసెంబరు 30వ తేదీతో ముగిసిందని వివరించారు. గతేడాదికి రాష్ట్రంలో రూ.482 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉండగా, రూ.465 కోట్లు (99 శాతం) రాబట్టామని, ఇంకా రూ.17 కోట్ల వసూలుకు చర్యలు తీసుకోవాలని డీఎంలను ఆదేశించారు. -
సీఎంఆర్ నిబంధనల సడలింపు!
► పౌరసరఫరాల శాఖ అధికారుల భేటీలో మంత్రి ఈటల నిర్ణయం ► మిల్లర్లకు చివరి అవకాశం సాక్షి , హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను అత్యధికంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణ యానికి వచ్చింది. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వినియోగిస్తున్న సర్కారు వీటికి అవసరమైన వడ్లను స్టేట్ పూల్ నుంచి కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇందు కోసం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిబం ధనలను స్వల్పంగా సడలించాలను కుం టోంది. ఈ మేరకు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం సచివాలంయలో పౌర సరఫరాలశాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణను తక్కువ సమయంలో పూర్తి చేయడానికి మిల్లర్లకు కూడా చివరి అవకాశం ఇద్దామని ఈటల ఈ భేటీలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పొరపాట్లకు తావివ్వకుండా సీఎంఆర్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. గతంలో అక్రమ దందాలకు పాల్పడిన మిల్లర్లు, రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసిన మిల్లర్లకు సంబంధించిన కేసుల తీవ్రతనుబట్టి సీఎంఆర్ కోసం ధాన్యం ఇవ్వకూడదని నిర్ణరుుంచారు. స్టాకులో తేడాలు, సీఎంఆర్ బకారుుల తది తరాలపై నమోదైన కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ఈసారికి సీఎంఆర్‌లో ధాన్యం ఇవ్వాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సీజన్లో ప్రారం భమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించేలా, రైతులకు ధాన్యం సొమ్ము సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈటల ఆదేశిం చారు. రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థారుులో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉప్పు కొరత లేదని, 900 మెట్రిక్ టన్నుల ఉప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిత్యావస రాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వ్యాపా రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. -
బియ్యం అక్రమార్కులపై.. ఎట్టకేలకు చర్యలు
ఇనగంటి గాంధీ రూ.3.69 కోట్లు చెల్లించాలంటూ పోలీసులకు ఫిర్యాదు ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు సీఎంఆర్ విధానంలో అక్రమాలకు పాల్పడిన ఫలితం అవినీతి అధికారులపై చర్యలేవి? బాపట్ల టౌన్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానం అమలులో అక్రమాలకు పాల్పడిన రైస్మిల్లరుపై జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. ధాన్యం తీసుకున్న మిల్లర్లు మర ఆడించి 15 రోజుల్లో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇవ్వాల్సి ఉంటే, ఆడించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి ప్రభుత్వ ధనాన్ని సొంత వ్యాపారానికి వాడుకున్నారు. నెలల తరబడి ఇలా కొందరు మిల్లర్లు అధికార యంత్రాంగానికి బియ్యం సరఫరా చేయలేదు. అనేక మంది మిల్లర్లకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడటంతో అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అక్రమాలపై గత జూలై నెలలో ‘సాక్షి’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అప్పటి నుంచి మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అధికారులు ఎట్టకేలకు సోమవారం చర్యలకు ఉపక్రమించారు. బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన అనూరాధ రైస్ ట్రేడర్స్ యజమాని ఇనగంటిగాంధీ మర ఆడించడానికి ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి, బహిరంగ మార్కెట్లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేసుకున్నారు. ప్రభుత్వానికి రూ. 2.46 కోట్లు చెల్లించలేదు. ఏడెనిమిది నెలలుగా ఆ మిల్లరుతో అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.రంగాకుమారి సోమవారం సాయంత్రం బాపట్ల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బియ్యం విషయంలో జరిగిన తంతును వివరించి, కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వానికి 1178 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని అందజేయాల్సి ఉందని, దానికి గానూ రూ. 2,46,18,206 చెల్లించాలన్నారు. నిర్ణీత సమయంలోగా బియ్యాన్ని అందించలేని పక్షంలో 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగిందని, దాని ప్రకారం రూ. 1,23,09,103 చొప్పున మొత్తం రూ. 3,69,27,309 చెల్లించాలంటూ తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు తాలుకా ఎస్ఐ చెన్నకేశవులు ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సహకరించిన వారిపై చర్యలేవి..? ఈ అక్రమ వ్యవహారంలో మిల్లరుకు పౌరసరఫరాలశాఖలో కొందరు అధికారులు సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇనగంటి గాంధీ గతంలో కూడా ఇదే విధంగా మర ఆడించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగానికి సకాలంలో ఇవ్వలేదు. అతని గురించి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, అధికారులు బియ్యం ఆడించి ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతికి అధికారులు అవినీతికి పాల్పడ్డారని, ట్రాక్ రికార్డు సక్రమంగా లేని మిల్లరును ఎంపిక చేయడం వలన ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందని, ఇందులో అధికారుల పాపం కూడా లేకపోలేదని జిల్లా యంత్రాంగానికి కూడా తెలుసు. అప్పట్లో జిల్లా జాయింట్ కలెక్ట్ శ్రీధర్ ఈ మిల్లరుతో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. వెంటనే బియ్యం ఆడించి ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. టీడీపీ పాలకులు అధికార యంత్రాంగంపై వత్తిడి తీసుకువచ్చారు. మన వాడే ఇబ్బందుల్లో ఉన్నాడు. రెండు మూడు నెలల్లో ధాన్యం ఆడించి బియ్యం ఇస్తాడు. అప్పటి వరకు సహకరించండని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇంతకాలం ఈ వ్యవహారం కొనసాగింది. దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటే ఇటువంటి అక్రమాలు కొంత వరకు ఆగుతాయనే అభిప్రాయం వినపడుతోంది. -
మెక్కిన బియ్యం..కక్కిస్తారా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గడువు సమీపిస్తున్నా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) సరఫరా చేయడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో సేకరించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ను కక్కించాల్సిన పౌరసరఫరాల శాఖ వ్యవహారమే ప్రస్తుత పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. గడువులోగా స్పందించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఎంతమేర ఫలితాన్నిస్తాయో చూడాల్సిందే. ఈ ఏడాది మార్చిలో రైతులు పండించిన వరి దాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేశారు. పౌర సరఫరాల శాఖ వద్ద కొనుగోలుకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో ధాన్యం సేకరణ బాధ్యత ఐకేపీ సంఘాలకు అప్పగించారు. ఇలా సేకరించిన 61,308.439 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలోని 44 రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. ఇలా స్వీకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. స్వీకరించిన ధాన్యంలో 68శాతం అంటే 41,689.738 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి సెప్టెంబర్ 30వ తేదీలోగా సరఫరా చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు మొదలుకుని కస్టమ్ మిల్లింగ్ వ్యవహారాన్ని పౌర సరఫరాల శాఖ పర్యవేక్షించాలి. అయితే పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 31.35 శాతం అంటే 19,225.015 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖ గోదాములకు చేరింది. గడువులోగా బియ్యాన్ని సరఫరా చేయాలంటూ ఎన్నిమార్లు తాఖీదులు పంపినా, సమీక్ష నిర్వహించినా మిల్లర్లు స్పందించడం లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా సమీక్షలు మినహా మిగతా సందర్భాల్లో కనీసం సీఎంఆర్ పురోగతిపై సమాచారం పంచుకునేందుకు కూడా సుముఖత చూపడం లేదు. నెలాఖరులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు మిల్లర్లకు తెగేసి చెప్పినా ఫలితం కనిపించడం లేదు. విషయం కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో గడువులోగా స్పందించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పక్కదారి పట్టిన సీఎంఆర్ ఐకేపీ సంఘాల ద్వారా సరఫరా అయిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ఇప్పటికే బహిరంగ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఎక్కువగా ఉండటంతో గోదాములకు తరలాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో సేకరించిన ధాన్యం మిల్లర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతోందనే విమర్శలున్నాయి. బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు కోటాను పూర్తి చేసేందుకు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని పక్కదారి పట్టించి కొందరు మిల్లర్లకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. రీ సైక్లింగ్ పద్ధతిలో పీడీఎస్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వ గోదాములకు చేర్చేందుకు సన్నాహలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో జిల్లాకు చెందిన పీడీఎస్ బియ్యాన్ని మెదక్ జిల్లా నాగులపల్లి రైల్వే యార్డు కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్టాక్ పాయింట్లలో బియ్యం నిల్వల లెక్కల్లోనూ గతంలోనూ తేడాలు వచ్చాయి. మిల్లర్లు మాత్రం ఆరోపణలు తోసిపుచ్చుతూ ఇతర అంశాలను సాకుగా చూపుతున్నారు. కరెంటు కోతలు, గోదాముల కొరత వల్లే సకాలంలో ఇవ్వలేకపోతున్నామంటూ బదులిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు పర్మిట్ల జారీలో పౌర సరఫరాల శాఖ తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎన్ని వస్తున్నా అధికారులు మాత్రం మిల్లర్లపై ఎక్కడా కేసులు నమోదు చేసిన జాడ కనిపించడం లేదు. గడువులోగా సీఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఎంత మేర కొరడా ఝళిపిస్తుందో చూడాల్సిందే. -
దొడ్డిదారిలో ‘సీఎంఆర్’ బియ్యం తరలింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిమ్మిని బమ్మి చేయడం రైస్ మిల్లర్లకు తెలిసినంతగా మరెవరకీ తెలియదేమో.. రైతులు తెస్తున్న ధాన్యాన్ని బియ్యం చేయడంలోనే కాదు.. డీలర్ల ద్వారా బియ్యం అక్రమ సరఫరా చేయించడం, చిల్లర వ్యాపారుల నుంచి పీడీఎస్ (పౌరసరఫరాల) బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే పాలిష్ చేసి ఫైన్.. సూపర్‌ఫైన్‌గా నమ్మించి అధిక ధరలకు అమ్మేయడం వారికే చెల్లింది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీఎంఆర్’ (కస్టమ్స్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని కూడా పక్కదోవ పట్టిం చేందుకు కొందరు రంగం లోకి దిగారు. ఇటువంటి అక్రమాలపై కన్నేసిన విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు జరుపుతూ కేసులు నమోదు చేయడంతో పాటు స్టాక్‌ను సీజ్ చేస్తున్నారు. పలువరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి. లెవీలో హెవీ..సీఎంఆర్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వాటిని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్పించి మళ్లీ ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియను గతంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేపట్టేది. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం తాజాగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒడిశాలో తొలుత ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా అక్కడ విజయవంతమైంది. దాంతో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో దాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రైతుకు మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. వాటిని 67 శాతం లెవీ ఇచ్చేందుకు మిల్లర్లకు ఇస్తోంది. ధాన్యాన్ని బియ్యంగా తయారు చేసేందుకు కొంత మిల్లింగ్ చార్జీ కూడా ఇస్తోంది. తవుడు, పొట్టు, తరుగులాంటి చిల్లర ఖర్చు పోనూ వచ్చే బియ్యం లో 67శాతం సరుకును మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. బియ్యం పక్కదారి రైతు నుంచి సేకరించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యం ఆడించిన తర్వాత బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో రేషన్‌డీలర్ల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని, ఇతరత్రా తక్కువ రకం సరుకును ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఇలా గత కొన్నాళ్ల నుంచి జరుగుతోంది. సమయానుకూలంగా తనిఖీలు లేకపోవడం, కచ్చితమైన సమయానికే బియ్యం ఇవ్వాలనే ఆంక్ష లు నిబంధన లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని పలువురు మిల్లర్లు ఏకంగా బియ్యాన్ని మార్చేస్తున్నారని ఇటీవల అధికారులు జరిపిన దాడుల్లో బయటపడింది. గ్రేడింగ్ సరిగా లేకపోవడం, తక్కువ ధర కు కొనుగోలు చేసిన బియ్యాన్ని డంప్ చేయడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. జిల్లాలో సుమా రు 120 మిల్లులకు సీఎం ఆర్ ధాన్యం సరఫరా చేస్తే వాటిలో సుమారు 87 మిల్లులు అక్రమాలకు పాల్పడినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుండగా మిల్లర్లు మాత్రం భారీగా లాభపడుతున్నారు. కేసుల నమోదు పాలకొండ, భామిని, బమ్మిడి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, ఆమదాలవలస ప్రాంతాలతో పా టు మరికొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ బియ్యం లేకపోవడం, అక్రమ నిల్వలు, సీఎంఆర్ బియ్యంగా మార్చేం దు కు కావాల్సిన సరంజామా వంటి వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ అక్రమాల విలువ ఒక్క పాలకొండలోనే సుమారు రూ.4 కోట్లకు పైనే ఉంటుందని ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిసింది. నిబంధనల ప్రకారం 6ఏతోపాటు కొంతమంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమో దు చేశారు. పాలకొండలోని శ్రీవెం కటేశ్వర ట్రేడర్స్ (కేరాఫ్ విజ యదుర్గ రైస్‌మిల్)లో భారీగా అవకతవకలు జరిగాయని, నిబంధనల మేరకు సుమారు రూ.80 లక్షల విలువైన బియ్యాన్ని సీజ్ చేశామ ని, యజమానిపై క్రిమినల్ కేసు నమోదుకు అక్కడి తహశీల్దార్, రెవెన్యూ అధికారులను ఆదేశించామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అం దజేయాల్సిన సుమారు రూ.48 కోట్ల విలువైన బియ్యం నిల్వలకు సంబంధించి జేసీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని మరికొందరు అక్రమార్కులపై ఇప్పటికే 6ఏ కేసులు నమోదు చేసి కోర్టుకు తెలియజేశామన్నారు. కాగా రెవె న్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్టు ప్రకారం అక్రమార్కుల ఆస్తులు/స్టాకు స్వాధీనానికి కూడా చర్యలకు ఉపక్రమించామని పౌరసరఫరాల కార్పోరే షన్ జిల్లా మేనేజర్ లోక్ మోహన్‌రావు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సీహెచ్. ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. పక్షం రోజుల్లో మిల్లర్లంతా సీఎం ఆర్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అప్పగించకపోతే చర్యలు తప్పవని జేసీ ఇప్పటికే హెచ్చరించారు. అక్రమాలు నిజ మేనని రుజువైతే కనీసం 25 మిల్లులను పూర్తిస్థాయిలో సీజ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.