
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల యాసంగిలో రా రైస్ (పచ్చిబియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదనే ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ అప్పగిస్తున్నామని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని రా రైస్‌గా మారిస్తే బియ్యానికి బదులు నూకలు 30 నుంచి 40 శాతం వస్తాయని, బ్రోకెన్ రైస్‌ను ఎఫ్‌సీఐ 25 శాతమే అనుమతిస్తుందని అన్నారు.
ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అర్థరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే ధాన్యం సేకరణ కేంద్ర జాబితాలోని అంశంగా వస్తోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment