
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో చోటు చేసుకున్న బాలికల హత్యలకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని హైదరాబాద్ నగరశాఖ పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. మండలంలోని హాజీపూర్, మైసిరెడిపల్లి గ్రామాల్లో ఆదివారం వారు పర్యటించారు. బాధిత కుటుంబాలను కలసి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రఘునా«థ్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment