
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వరుస హత్యల కేసులో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డికి పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నల్లగొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ భుజంగరావు వెల్లడించారు.
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు పోలీసులు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను హత్య చేసిన ప్రదేశంలో గాలించగా బాలిక స్కూల్ ఐడీ కార్డు లభించింది. అలాగే తిప్రబోయిన మనీషా ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ పడవేసిన ప్రాంతంలో వెతకగా, అధార్ కార్డు లభ్యమైంది. సెల్‌ఫోన్ జాడ దొరకలేదు. ముగ్గురు బాలికల హత్యలలో నిందితుడు ఒంటరిగానే దురాగతాలకు పాల్పడ్డాడా.. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో మూడు రోజుల పోలీస్ కస్టడీలో విచారించినట్లు తెలిసింది.