వోల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణ పూర్తి
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద సంఘటనపై విచారణ పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30న కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు నేటి వరకూ ఆధారాలను సేకరించారు.
మరో 16 మృతదేహాలు గుర్తింపు
ఇక బస్సులో అగ్నికి ఆహుతై గుర్తించరాని విధంగా ఉన్న మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి త రలించి మార్చురీలో ఉంచారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. వాటి ఆధారంగా మంగళవారం మరో 16 మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. వాటిని ఈరోజు సాయంత్రం బంధువులకు అప్పగించనున్నారు. నిన్న 19 మృతదేహాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. ప్ర స్తుతం డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోందని, మరో ఒకటి రెండు రోజుల్లో మిగిలిన మృతదేహాలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు.