అమరేందర్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి | Software engineer Amarendar funeral procession in Namcharla | Sakshi
Sakshi News home page

అమరేందర్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి

Published Thu, Oct 31 2013 10:51 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

అమరేందర్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి - Sakshi

అమరేందర్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి

నంచర్ల : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి అమరేందర్ భౌతికకాయానికి నంచర్లలో గురువారం బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.....బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.

కాగా కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన  అమరేందర్ బెంగళూరులోని క్యాప్ జెమినీ సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దీపావళికని బెంగళూర్ నుంచి మంగళవారం రాత్రి బస్సులో బయలుదేరాడు. కానీ, తనవారిని చూసుకోకుండానే మధ్యలోనే మృత్యువాత పడ్డాడు. అమరేందర్‌కు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఆయన భార్య నర్మద ప్రస్తుతం గర్భంతో ఉంది. అమరేందర్ మరణాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.  కుమారుడు పండుగకు రెండు రోజుల ముందే ఇంటికి వస్తున్నాడని సంబరపడిన ఆ కుటుంబానికి తీరని విషాదమే మిగిలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement