బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు | Mahabubnagar Volvo Bus fire incident enquiry begins | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు

Published Thu, Oct 31 2013 11:18 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు - Sakshi

బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద నిన్న జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలో ల్యాప్టాప్తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

వోల్వో బస్సు ప్రమాదంలో 45మంది సజీవ దహనం కాగా,  చనిపోయినవారి  మృతదేహాలను కొన్నింటిని బంధువులు గుర్తించటంతో అధికారులు వారికి అప్పగించారు. మిగిలిన మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రిలో భద్రపరిచారు. మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి...మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతుల బంధువులు గురువారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి చేరుకున్నారు. వారి డీఎన్‌ఏ ను ఆస్పత్రి సిబ్బంది సేకరించగా, పోలీసులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. డీఎన్ఏ ఫలితాలు రావటానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement