వోల్వో బస్సులో పొగలు... ప్రయాణికుల అవస్థలు | Smoke in private travels Volvo bus, no one injured in Mahabubnagar districts | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సులో పొగలు... ప్రయాణికుల అవస్థలు

Published Sat, May 10 2014 8:20 AM | Last Updated on Mon, Oct 22 2018 2:14 PM

Smoke in private travels Volvo bus, no one injured in Mahabubnagar districts

మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం ఆమరబాకుల వద్ద గత అర్థరాత్రి ప్రైవేట్ వోల్వో బస్సు ఇంజిన్లో ఆకస్మాత్తుగా పోగలు వచ్చాయి. ఇంజిన్లో పొగలను గుర్తించిన వోల్వో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి... ఇంజిన్లో పొగలను ఆర్పివేశాడు. బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సు నుంచి దూకేశారు.

 

అయితే అర్థరాత్రి నుంచి రహదారిపైనే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వోల్వో  ట్రావెల్స్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement