వేగం వస్తున్న వోల్వో బస్సు రోడ్డు దాడుతున్న స్కూటర్‌ను సైకిల్‌ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు దర్మరణం పాలయ్యారు.
పలమనేరు: వేగం వస్తున్న వోల్వో బస్సు రోడ్డు దాడుతున్న స్కూటర్‌ను సైకిల్‌ను ఢీకొనడంతో ఇరువురు వ్యక్తులు దర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన పలమనేరు సమీపంలోని సిల్క్ ఫామ్ వద్ద చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పలమనేరు పట్టణంలోని దండపల్లె ప్రాంతంలో నివసిస్తున్న మస్తాన్(45) లారీ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. పట్టణంలో జెండామఠానికి చెందిన అన్వర్(36) డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ లారీ బాడిబిల్డింగ్ విషయమై పట్టణ సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు వెళ్లారు. అక్కడినుంచి స్కూటర్‌పై మెయిన్‌రోడ్డులోకి రాగానే బెంగుళూరు నుంచి తిరుపతివైపు వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సు వీరి స్కూటర్‌ను వేగంగా ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కన పల్లంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. వోల్వో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అప్పటికే 108 సిబ్బంది బస్సులోని స్వల్ప గాయాలు తగిలినవారికి చికిత్సలు చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా సిల్క్‌ఫామ్ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌ను ఎస్‌ఐ శ్రీరాముడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పలమనేరు ఆసపత్రికి తరలించారు. ఇలావుండగా బస్సు డ్రైవర్ ప్రమాద స్థలంలో కనిపించలేదు. మృతుడు మస్తాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్వర్ సైతం గతంలో లారీ యజమానిగా ఉంటూ నష్టాలపాలై ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ సంఘటనతో ఆ రెండు కుటుంబాల సభ్యులు అనాథలయ్యారు.