హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపావళి టపాసులు బస్సులో హైదరాబాద్కు చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సులో సరుకు రవాణపైన కూడా విచారణ జరుపుతున్నారు. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 45మంది సజీవ దహనం అయ్యారు.
మరోవైపు బస్సు ప్రమాద సంఘటన జరిగిన సమాచారం తెలుసుకుని మృతుల బంధువులు మిన్నంటాయి. బస్సు యాజమాన్యంపై మృతుల బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
బస్సులో పేలుడు పదార్థాలు ఉన్నాయా?
Published Wed, Oct 30 2013 1:06 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement