వామ్మో... వోల్వో! | peoples are afraid to travel on private buses | Sakshi
Sakshi News home page

వామ్మో... వోల్వో!

Published Sun, May 11 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

వామ్మో... వోల్వో!

వామ్మో... వోల్వో!

వోల్వో. ఈ పేరు వినగానే రాష్ట్ర ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది పాలెం దుర్ఘటన.

 కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : వోల్వో. ఈ పేరు వినగానే రాష్ట్ర ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది పాలెం దుర్ఘటన. ఈ సంఘటనలో 45 మంది సజీవ దహనమైన సంఘటన తెలిసిందే. జాతీయ రహదారిపై నుంచి సుదూర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు కొత్తకోట మీదుగా వెళ్తున్నప్పుడు ఆసంఘటన ఎ క్కడ జరిగిందా.. అని చూస్తుంటారు. అంతటి భయానకరమైన సంఘటన జరిగినా ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకుల తీరులో మార్పులు రావడంలేదు. కండీషన్ లేని వాహనాలనురోడ్డుపై వదులుతూ ప్రయాణికుల ప్రా ణాలతో చెలగాట మాడుతున్నారు. తరచూ వోల్వో, ఇతర బస్సులు హైవేపై మొరాయిస్తూనే ఉన్నాయి. పొగలు కమ్ముకోవడం, ప్రయాణికులు ఆందోళనకు గురికావడం, మళ్లీ ఏదో కారణం చెప్పి సర్దిచెప్పడం చేస్తూనే ఉన్నారు. కానీ కండీషన్ ఉన్న వాహనాలను మాత్రం నడపడంలేదు. పైన పటారం లోన లొటారం అన్న చందంగా కొత్త వాహనాల వలే రంగులు వేసి బస్సు యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి.
 
 తాజాగా అమడబాకుల వద్ద..
 శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో 49 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బయల్దేరిన నీతా ట్రావెల్స్ వోల్వో బస్సు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కొత్తకోట మండలం అమడబాకుల సమీపానికి రాగానే పొగలతో కమ్ముకుంది. ఓ వృద్ధ ప్రయాణికుడు గురక పెట్టడంతో పక్కనున్న ప్రయాణికులు మేల్కొని మందలించడానికి ప్రయత్నించగా బస్సులోని పొగలను చూసి కేకలు వేశారు. డ్రైవర్ రెహమాన్ వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించాడు.

కంప్రెషర్ వద్ద ఉన్న పైపు బోల్టు ఊడిపోయి లీకు కావడం వల్ల పొగలు కమ్ముకున్నాయని డ్రైవర్ తెలిపారు. గమనించకుండా ఉంటే పొగవేడిమికి మంటలు వ్యాపించే అవకాశం ఉండేదని, బస్సు మేయింటనెన్స్ ఇలాగేనా ఉండేదని ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదం చేశారు. కాగా అర ్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణికులు బస్సు వద్దే ఉండిపోయారు. బస్సు యాజమాన్యం తమను సురక్షితంగా మరో బస్సులో పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బస్సును పరిశీలించి మరో ప్రైవేటు బస్సులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలావుండగా గత మూడనెలలుగా అడ్డాకుల మండలం టోల్‌ప్లాజా వద్ద కూడా రెండుమూడు పర్యాయాలు వోల్వో బస్సుల్లో పొగలు కమ్ముకున్నాయి. అక్కడి సిబ ్బంది అప్రమత్తంతో అప్పట్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు టోల్‌ప్లాజావద్ద సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కండీషన్‌ను పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement