శ్రీకాకుళం: యాత్రీజనీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద మంగళవారం రాత్రి జాతీయరహదారిపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఇంజిన్ నుంచి వెలువడిన మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రోడ్డుపక్కన బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు వెంటనే అందులో నుంచి కిందికి దిగారు. ఎవ్వరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. బస్సులోని అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
వోల్వో బస్సులో చెలరేగిన మంటలు..
Published Tue, Jul 5 2016 10:06 PM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM
Advertisement
Advertisement