
ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: జిల్లాలోని గుత్తి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ts 07z 4071 బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 35 మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేయబోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు.