
బాబు బస్సుకు రూ.10 కోట్లు!
బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో కొనుగోలుకు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటన కోసం సకల సౌకర్యాలతో కూడిన బుల్లెట్‌ప్రూఫ్ వోల్వో బస్సును కొనుగోలు చేయనున్నారు. సాధారణ వోల్వో బస్సు ఖరీదే సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుంది. ఇక సీఎం సేద తీరేందుకు, అదనపు సౌకర్యాలను కల్పించేందుకు, బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 10 కోట్లు పైగా వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోనుంది.