హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్సు డిజైనింగ్ లోపమే పాలెం దుర్ఘటనకు కారణమంటూ సీఐడీ ఇచ్చిన నివేదికను వోల్వో ఖండించింది. 12 ఏళ్లుగా దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, భారతీయ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘‘ప్రమాదం జరిగినపుడు బస్సు గంటకు 100 కి.మీకు పైగా వేగంతో సిమెంట్ దిమ్మెకు గుద్దుకుంది. ఈ తీవ్రత 5 మెగాజౌళ్ల శక్తికి సమానం. కాబట్టే తీవ్ర నష్టం సంభవించింది’’ అని వివరించింది. జరిగిన ప్రమాదాల్లో అత్యధిక శాతం బాహ్య అంశాలే కారణమని, వాటికి డిజైనింగ్‌తో సంబంధం లేదని పేర్కొంది.
బస్సు డిజైనింగ్‌లో లోపం లేదు: వోల్వో
Published Fri, Feb 28 2014 1:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement