గురక మంచిదే ..! | passengers escaped from accident with old man snoring! | Sakshi
Sakshi News home page

గురక మంచిదే ..!

Published Sun, May 11 2014 12:46 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

గురక మంచిదే ..! - Sakshi

గురక మంచిదే ..!

వోల్వో బస్సులో పొగలు.. వృద్ధుడి గురకతో మేల్కొన్న తోటి ప్రయాణికులు
 
 కొత్తకోట, న్యూస్‌లైన్: గురక భరించడం ఇబ్బందే అయినా.. ఇక్కడ మాత్రం చాలామంది ప్రాణాలు కాపాడింది.  ఓ ప్రయాణికుడు పెట్టిన గురక భరించలేక నిద్ర  మేల్కొన్న తోటి ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచే బయట పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల స్టేజీ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. నీతా ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 49 ప్రయాణికులతో  శుక్రవారం రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరింది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 1.30 గంటలకు కొత్తకోట మీదుగా వెళ్తుండగా ఓ వృద్దుడు పెట్టిన గురకను భరించలేక.. నిద్ర మేల్కొన్న తోటి ప్రయాణికులు బస్సులో కమ్ముకున్న పొగలను చూసి ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో డ్రైవర్  బస్సును పక్కకు నిలిపి అందులోని వారందరినీ కిందికి దింపివేశాడు. ఇంజిన్‌లోని కంప్రెషర్ పైపునకున్న బోల్టు ఊడిపోవడంతో పొగలు కమ్ముకున్నాయని, ఒకవేళ.. ప్రయాణికులు గమనించకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని డ్రైవర్ రహమాన్ చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement