కలెక్టరేట్, న్యూస్‌లైన్: పాలెం బాధితుల ఆందోళనకు రాష్ట్రసర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది. వోల్వో బస్సు దహనమైన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ మేరకు నిధులను జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర చెక్‌ను గురువారం జిల్లాకు పంపించింది. కొత్తకోట మండ లం పాలెం వద్ద గత అక్టోబర్‌లో వోల్వో బస్సు దగ్ధమైన 44 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. మరో ఐదుగు రు తీవ్రగాయాలతో బతికిబయటపడ్డా రు.
ఇక ఈ ప్రమాదంలో మృతిచెందిన వా రి ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. ఈ దుర్ఘటన దేశ, అంతర్జాతీయ స్థాయి లో తీవ్రంగా కలిచివేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో కనీస బాధ్యతను విస్మరించింది. దీంతో అసహనానికి గురైన బాధిత కుటుంబాలు మూణ్నెళ్లుగా రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడంతోపాటు, సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమా లు చేపట్టాయి. పలు ప్రజాసంఘాలు వీ రికి మద్దతుగా నిలిచాయి.
ఉద్యమసెగను ప్రభుత్వానికి చూపించినా ఏమాత్రం కనికరిం చలేదు. కాగా, ఇటీవల నెలరోజుల క్రితం బెంగళూర్‌లో ఇదే తరహా ఘటనలో ఏడుగురు సజీవదహనం కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. దీంతో బాధిత కు టుంబసభ్యులు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పరిహారం ఇవ్వాలని ఆం దోళను మరింత ఉధృతం చేశారు. ఎట్టకేలకు మూణ్నెళ్ల తరువాత మృతుల కు టుంబసభ్యులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష పరిహారం మంజూరుచేసింది. మృతి చెం దిన 44మందికి సంబంధించి రూ.44లక్షలను బాధితులకు చెల్లించేం దుకు ఈమొత్తాన్ని జిల్లా కలెక్టర్ పేర జారీచేసింది.
నేడోరేపో పరిహారం అందజేత
మంజూరైన ఎక్స్‌గ్రేషియాను మృతుల కుటుంబాలకు అందజేసేందుకు వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సరైన ఆధారాలతో వెంటనే చెక్కులను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నా రు. ఈ ప్రక్రియను పదిరోజుల్లో పూర్తిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు.
క్షతగాత్రులకు మొండిచేయి
కాగా, ఈఘటనలో తీవ్రగాయాలతో ఐదుగురు ప్రయాణికులు బతికి బయటపడ్డారు. వీరికి హైదారాబాద్‌లో చికిత్సచేయించిన ప్రభుత్వం ఎలాంటి ఎక్స్‌గ్రేషియాను ఇవ్వకుండా మొండిచేయి చూపిం ది. వీరి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడినా పనిచేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. వీరికి చికిత్స చేయించాం, ఇంకెలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వబోమనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు
Published Fri, Dec 27 2013 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement