బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ....ముఖ్యమంత్రి ఫోన్తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో 42మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు డీఐజీ వెల్లడించారు.