బెంగళూరులో జబ్బర్ ట్రావెల్స్ యజమాని పరారీ | Volvo Bus Jabbar Travels owner escapes from Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో జబ్బర్ ట్రావెల్స్ యజమాని పరారీ

Published Wed, Oct 30 2013 10:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Volvo Bus Jabbar Travels owner escapes from Bangalore

బెంగళూరు : మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన జబ్బర్ ట్రావెల్స్ బెంగుళూరు కార్యాలయం యజమాని షకీల్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న షకీల్ ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. జబ్బర్ ట్రావెల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు, మిగతా కార్యాలయాల వద్ద బెంగళూరు సివిల్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు.

బస్సు ప్రయాణికుల వివరాలను బెంగళూరు పోలీసులు సేకరిస్తున్నారు. రెండు బస్సుల ప్రయాణికులను ఒకే బస్సులో తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. రాత్రి పది గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరిన బస్సులో  చాలామంది బెంగళూరుకు చెందినవారు ప్రయాణికులే ఉన్నారు.  బస్సు నుంచి ఇప్పటివరకూ 44 మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement