
ప్రయాణికుల వివరాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం
వోల్వో బస్సు కల్వర్ట్ను ఢీకొనటం వల్లే ప్రమాదం సంభవించినట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ వెల్లడించారు.
హైదరాబాద్ : వోల్వో బస్సు కల్వర్ట్ను ఢీకొనటం వల్లే ప్రమాదం సంభవించినట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ వెల్లడించారు. బస్సు వేగంగా కల్వర్ట్ను ఢీకొనటంతో వెంటనే డీజిల్ ట్యాంక్ పేలిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి సహాయక చర్యలపై సమీక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ బస్సు దిగిపోవటం వల్ల బస్సు డోర్ తెరిచేవారు లేకపోయారన్నారు. బస్సు ఆటోమేటిక్ లాక్ ఉండటం వల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంలో అయిదుగురు తప్ప మిగిలిన వారందరు మృతి చెందారని కలెక్టర్ తెలిపారు. మృతుల వివరాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి గురైన వారిలో కొందర్ని గుర్తించారు. మరికొందర్ని గుర్తించాల్సి ఉంది. కాగా ప్రమాదానికి గురైన వారిలో ఆసిఫ్, ఉమర్, పుట్టియు, రామరాజు, వేదవతి , జ్యోతి, మోతి , హజ్మతుల్లా ఆడారి, వెంకటేష్, కిరణ్, నియోబ్, హఫీజ్ ,చంద్రశేఖర్, బాల సుందర్ రాజు ఉన్నారు.
బస్సు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు
మహబూబ్‌నగర్ కంట్రోల్ రూమ్ నంబర్లు:
9494600100, 08542-245927/30/32