పెనుకొండ : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆదిత్య ఓల్వో బస్సును పెనుకొండ ఎంవీఐ మల్లికార్జున గురువారం తెల్లవారుజామున సీజ్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు ఆంధ్రా ట్యాక్స్ లేదని సమాచారం మేరకు చెక్‌పోస్ట్ సమీపంలో వాహనాన్ని ఆపి రికార్డులు పరిశీలించారు. ట్యాక్స్ కట్టని విషయం నిర్ధరణ కావడంతో సీజ్ చేశారు.