బస్సు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి | engineering student died in a road accident | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Published Fri, May 22 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

engineering student died in a road accident

నెల్లూరు: వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అసువులు బాశాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దగదర్తి మండలం దామవరం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య (20) నెల్లూరులోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం తండ్రితో కలసి గొర్రెలు మేపేందుకు వెళ్లాడు.

వేకువ జామున కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద గొర్రెలు మేపుతుండగా ఓ వోల్వో బస్సు గొర్రెలతో పాటు, వెంకట్రామయ్యను ఢీకొంది. దీంతో బీటెక్ విద్యార్థి వెంకట్రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆరు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement