svr travels
-
మత్తులో ట్రావెల్స్ డ్రైవర్, కండక్టర్
బుగ్గారం : జగిత్యాల నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్ బుధవారం డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. జగిత్యాల ఆర్డీవో నరేందర్ గుర్తించడంతో ప్రయాణికుల కు ముప్పు తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం జగిత్యాల నుంచి మంచిర్యాలకు ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు 30మంది ప్రయాణికులతో బయలు దేరింది. అదే సమయం లో ధర్మపురి వైపు ఆర్డీవో నరేందర్ కారులో వెళ్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తుండటాన్ని గమనించి బుగ్గారం ఎస్సై చిరంజీవికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎక్స్‌రోడ్డు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ ఖాజా, కండక్టర్ జీవన్రెడ్డికు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించినట్లు రుజువు కాగా కేసు నమోదు చేశారు. ప్రైవేటు బస్సును స్టేషన్‌కు తరలించారు. -
ఓల్వోకు టికెట్లు తీసుకుంటే హైటెక్ బస్ ఏర్పాటు
మన్సూరాబాద్: ఓల్వో బస్‌కు టెకెట్లు బుక్ చేసుకుంటే నాసిరకం హైటెక్ బస్సు (టీఎస్ 12 యూబీ 3645)ను పంపిన ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమాన్యం.. పంపిన బస్సు నగరం దాటకుండనే మార్గమధ్యంలో నిలిచిపోయిన సంఘటన శుక్రవారం రాత్రి ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్వీఆర్ ట్రావెల్స్‌లోని ఓల్వో బస్‌లో నగరం నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయాణికులు టెకెట్లు బుక్ చేసుకున్నారు. సదరు ట్రావెల్స్ బస్సు ఎల్బీనగర్కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉంది. ప్రయాణికులు పలు మార్లు ఫోన్ చేయగా ఎస్వీఆర్ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు హైటెక్ బస్సును పంపించింది. తీరా బస్సు చింతలకుంటకు రాగానే చెడిపోయి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు యాజమాన్యానికి ఫోన్ చేసి సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి అందోళనకు దిగారు. సాయంత్రం 6.30 నుంచి బస్సు కోసం ఎదరుచూస్తున్నామని, బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎర్పడిందని ఆవేదన చెందారు. ఎస్వీఆర్ ట్రావెల్స్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగానే తామంతా అవస్థలు పడుతున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 12మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. -
వోల్వో బస్సు బోల్తా, 10 మందికి గాయాలు
కల్లూరు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు సోమవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని పెద్దటేకూరు గ్రామ శివారులో బోల్తా పడింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (కేఏ01 ఏఏ 9549) 48 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు పెద్దటేకూరు గ్రామం వద్ద లారీలో ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని పక్కనున్న పొలంలోకి పల్టీ కొట్టింది. బస్సు ముందు భాగంలోని పెద్ద అద్దాన్ని పగులగొట్టి డ్రైవర్ ప్రతాప్‌తో పాటు ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. గాయపడిన వారిని పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు. -
హైదరాబాద్ శివార్లలో SVR ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు
-
ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు దగ్ధం
-
ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు దగ్ధం
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో ఓ ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. గ్యాస్ లీక్ కావటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా హయత్‌నగర్ శివారు పెద్ద అంబర్‌పేటకు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఏసీలోని గ్యాస్ లీక్ కావటంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో ఫైర్‌ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలంలోకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. రాజమండ్రిలోని సత్యసాయి ఫోటో ఫ్రేమ్ ఫ్లైవుడ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మొదట అంతస్తులో చెలరేగిన మంటలు ....మూడు అంతస్తులకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సకాలంలో అక్కడి చేరుకున్న ఫైర్‌ఇంజన్ సిబ్బంది మంటలు ఆర్పటంతో మంటలు ఇతర ప్రాంతాలకు అవి వ్యాపించకుండా నిరోధించగలిగారు.