
బుగ్గారం : జగిత్యాల నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్ బుధవారం డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. జగిత్యాల ఆర్డీవో నరేందర్ గుర్తించడంతో ప్రయాణికుల కు ముప్పు తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం జగిత్యాల నుంచి మంచిర్యాలకు ఎస్‌వీఆర్ ట్రావెల్స్ బస్సు 30మంది ప్రయాణికులతో బయలు దేరింది. అదే సమయం లో ధర్మపురి వైపు ఆర్డీవో నరేందర్ కారులో వెళ్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తుండటాన్ని గమనించి బుగ్గారం ఎస్సై చిరంజీవికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎక్స్‌రోడ్డు వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ ఖాజా, కండక్టర్ జీవన్‌రెడ్డికు ఆల్కహాల్ పరీక్ష నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించినట్లు రుజువు కాగా కేసు నమోదు చేశారు. ప్రైవేటు బస్సును స్టేషన్‌కు తరలించారు.