వోల్వో బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద ఈ రోజు తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది మరణించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోర్టు ఆంక్షల కారణంగా ప్రమాద ఘటన స్థలానికి వెళ్లలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లాల్సిందిగా వైఎస్ జగన్ పార్టీనేతలను ఆదేశించారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో బస్సు రొడ్డుపక్కనే ఉన్న కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఆ కల్వర్ట్కు డీజిల్ ట్యాంక్ తగలడంతో ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. దాంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికుల్లో నలుగురు మాత్రం ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగిలినవారంత అగ్నికి ఆహుతి అయ్యారు.