గన్నవరం, న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఉప రవాణాశాఖ కమిషనర్ సిహెచ్.శివలింగయ్య పేర్కొన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అలిం డి యా పర్మిట్లు కలి గిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 225 ఉన్నాయన్నారు. వీటిలో 49 బస్సులకు సంబంధించి సర్వీసులు నడపలేమని యజమానులు పర్మిట్లను సరెండర్ చేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ చేస్తున్న ప్రైవేటు బస్సులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
మహబూబ్‌నగర్‌జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు ప్రమాదం జరగకముందు స్టేజ్ క్యారేజీ చేస్తున్న 200 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఘటన అనంతరం ఇప్పటివరకు మరో 220 బస్సులపై కేసులు నమో దయ్యాయన్నారు. ఈ కేసులకు సంబంధించి బస్సుల యాజమానులు, డ్రైవర్లను కోర్టుల్లో హాజరుపరచగా, జరిమానాలు చెల్లించి బయటకు వస్తున్నారని తెలి పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్టేజ్ క్యారేజీ చేస్తున్న బస్సుల పర్మిట్లను మూ డు నెలల పాటు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.305 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ. 165 కోట్లు మాత్ర మే వచ్చిందని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం, పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడం ఇందుకు కారణాలని వివరించారు. ఇప్పటివరకు పన్నులు చెల్లించని వాహనాలకు సంబంధిం చి ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సీజ్ చేస్తామని తెలిపారు. అవసరమైతే వాటి యాజమానులపై రెవె న్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్‌ల విధానాన్ని త్వరలో జిల్లాలో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి నంబరు పేట్ల తయారీ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించామని, 2015 డిసెంబరు నాటికి జిల్లాలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని శివలింగయ్య వివరించారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్
గరికపాడు (జగ్గయ్యపేట) : గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం వేకువజామున నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సును సీజ్ చేసినట్లు చెక్‌పోస్టు ఇన్‌చార్జి మృత్యుంజయరాజు తెలి పారు. ఆరంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా తనిఖీ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీసు నిర్వహిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనిఖీల్లో వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నాయుడు, సోనిప్రియ, రాంబాబునాయక్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
నిబంధనలు పాటించని బస్సులపై కేసులు
Published Sat, Jan 25 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement