వోల్వో బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు | 6 Injured in volvo bus accident at mahabubnagar district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు

Published Tue, Jun 17 2014 8:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

6 Injured in volvo bus accident at mahabubnagar district

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం వద్ద కర్ణాటకకు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఆ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

వోల్వో బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అధిక వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement