మెదక్ : మెదక్ జిల్లా మండలంలోనే బుదేరా శివారు 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు గురువారం లోయలోకి బోల్తా పడింది. సుమారు పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.... కర్ణాటకకు చెందిన ఓ ప్రేయివేటు ట్రావెల్స్ బస్సు బొంబాయి నుంచి హదరాబాద్ వస్తోంది. అయితే మండల పరిధిలోని బుదేరా చౌరస్తా సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది.