అనంతపురం: ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడికొండ చెక్పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని వోల్వో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సు, లారీని ఢీ కొట్టడంతో బస్సు ముందుభాగం దాదాపుగా నుజ్జునుజ్జు అయింది. దాంతో నాలుగు మృతదేహాలు బస్సులో చిక్కుకుని పోయాయని.... వాటిని బయటకు తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారు హైదరాబాద్ లేద బెంగళూరు నగరానికి చెందిన వారా అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.