
ఓల్వో బస్ డ్రైవర్, క్లీనర్ అరెస్ట్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై ఈ ఉదయం ప్రమాదానికి గురైన జబ్బార్ ట్రావెల్స్ ఓల్వో బస్ డ్రైవర్ ఫిరోజ్, క్లీనర్ ఫయాజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపిసి 337, 338, 304 ఏతోపాటు, మోటర్ వెహికల్ యాక్ట్ 109 , 177 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ లక్డికపూల్లో జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న నయీమ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని కొత్తకోట వద్ద ప్రమాద స్థలికి తీసుకు వెళ్లి విచారణ జరిపారు.
ఈ బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ప్రయాణికులలో కేవలం అయిదుగురు మాత్రమే బతికారు.