
కడుపులో బిడ్డతోసహా కాలిపోయిన ప్రియాంక
హైదరాబాద్: ఓ వైపు తల్లిని కాబోతున్నానన్న ఆనందం - మరోవైపు దీపావళి పండుగకి పుట్టింటికి వెళుతున్నానన్న సంబరం .... ఇవన్నీ ప్రియాంకకు ఎంతోసేపు నిలువలేదు. అన్ని కాలిబూడిదైపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం ఎన్హెచ్ 44పై ఈ ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటన ప్రియాంకతోపాటు ఆమె కడుపులోని బిడ్డ కాలి, మాడి, మసైపోయారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి మోహన్‌కుమార్ చిక్కడపల్లిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె ప్రియాంకకు బెంగళూరుకు చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యా భర్తలిద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగకు బెంగళూరు నుంచి హైదరాబాద్లోని పుట్టింటికి వస్తుండగా ప్రియాంకను ఓల్వో బస్సు పొట్టనబెట్టుకుంది. తమ బిడ్డ పండక్కి వస్తోందన్న ఆనందంలో ఉన్న ప్రియాంక తల్లి తండ్రులు మరణవార్తని తట్టుకోలేకపోతున్నారు.